News Update Today: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


News Update Today: ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధ వాతావరణం ప్రభావంతో పౌరవిమానయాన రంగంలో అనిశ్చితి నెలకొని, అనేక దేశాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘర్షణల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడటంతో వేలాది మంది ప్రయాణికులు విదేశాల్లోనే నిలిచిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టారు.

భారత ప్రభుత్వ సమన్వయంతో ఎయిర్ ఇండియా దుబాయ్ మరియు అబుదాబి నగరాల నుంచి ప్రత్యేక రెస్క్యూ విమానాలను నిర్వహించింది. అత్యవసర ఏర్పాట్లతో నడిపిన ఈ విమానాలు ఇవాళ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 149 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చారు. స్వదేశానికి క్షేమంగా చేరుకోవడంతో ప్రయాణికులు ఉపశమనం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరిన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

9 మందిని రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసింది. ఆ జాబితాను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన బిహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనతో పాటు నివేశ్ కుమార్ కూడా ఉన్నారు. అసోం నుంచి తేరాష్ గోవాలా, జోగెన్ మోహన్, హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఛతీస్‌గడ్ నుంచి లక్ష్మి వర్మ, ఒడిశా నుంచి మన్మోహన్ సావల్, సుజిత్ కుమార్, పశ్చిమ బెగాల్ రాహుల్ సిన్హా ఉన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఈ యుద్ధ మేఘాలు పశ్చిమాసియా అంతటా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో ఇప్పటివరకు 787 మంది మృతి చెందారు. ఈ లెక్కను ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది.

ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హోర్ముజ్‌ జలసంధిలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. నౌకలు వస్తే మాత్రం నిప్పులు పెడతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ హెచ్చరికలు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిణామాలతో హోర్ముజ్ మార్గంలో 700లకు పైగా ట్యాంకర్లు నిలిచిపోగా అందులో అత్యధికం చమురు నౌకలే కావడం గమనార్హం. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఆయిల్ ధరలుపై పడుతుంది. మారిటైమ్ అనలిటిక్ సంస్థలు విండ్ వర్డ్, కెప్లెర్ డేటా ప్రకారం, హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారిక ప్రకటన ఇంకా ఏమీ రాలేదని తెలిపింది. కానీ ఇరాన్ హెచ్చరికలతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *