Rathotsavam: రాతి చక్రాలతో చేసిన రథం.. ఈ రథోత్సవాన్ని ఎప్పుడైనా చూసారా..! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా దర్శన భాగ్యం కల్పించడం దీన్నే రథ యాత్ర అని కూడా అంటారు.

+

రాతి

రాతి చక్రాల రథోత్సవం ను ఏప్పుడైనా చూసారా…!!!

Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా దర్శన భాగ్యం కల్పించడం దీన్నే రథ యాత్ర అని కూడా అంటారు.ఇది ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు అందర్నీ  ఆశ్చర్యానికి గురి చేసే ఒక వింత కూడా ఉన్నది. అదే రథం చక్రాలు. చాలా చోట్ల రథం చక్రాలు చెక్క,లేదా ఇనుము తో తయారు చేసి అందులో స్వామి వార్లని కొలువు తీర్చి ఊరేగిస్తుంటారు.కానీ  చిత్తూరు జిల్లాలోని కడపనత్తం గ్రామంలో  స్వయంభుగా వెలసిన శ్రీఅలివేలి మంగమ్మ పద్మావతీ సమేత శ్రీ నల్లగుండ్రాయ స్వామి ఆలయంలో రాతి తో చెక్కబడిన చక్రాలతోనే రథాన్ని లాగుతున్నారు.రాతితో చెక్కబడిన  రథాన్ని లాగితినే విశిష్టం అంటున్నారు. రథం నడిచిన పురవీధులు సుభిక్షంగా, అష్ట ఐశ్వర్యాలు,భోగ భాగ్యములతో వర్ధిల్లాలి  అంటే రాతి రథోత్సవమే మేలని ఆలయ అర్చకులు లోకల్ 18 ద్వారా కొనియాడారు.

చెక్కు చెదరని రాయి రథం..

రథోత్సవం జరిపే ముందు రోజు స్వామి వార్లకి కల్యాణోత్సవం  జరిపి, మరుసటి రోజు సతీ సమేతంగా రథం పై కొలువు తీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తారు.ఈ ఊరేగింపులో 1890 సంవత్సరాలు కాలం నాటి రాతి చక్రాలు నేటికి చెక్కు చెదరకుండా భక్తులు కంట పడి, కనువిందు చేశాయి. రాతి చక్రాల రథం గ్రామ పుర వీధుల్లో వస్తుంటే కోలాటాలు,భజనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రాతి చక్రాల రథోత్సవాన్ని తిలకించడానికి మూడు రాష్టాల భక్తులు పోటెత్తారు.

మూడు రాష్ట్రాల నుంచి భక్తులు..

ఆంధ్ర,కర్ణాటక,తమిళనాడు నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో కడపనత్తo గ్రామoలో రథోత్సవ వైభవం ఉట్టిపడింది.రథోత్సవం నాడు రథంను బాగా అలంకరిస్తారు. రథంను భక్తులు లాగేందుకు రథానికి మోకు కడతారు. రథయాత్ర ప్రారంభ పూజలు తరువాత జయజయధ్వనాలతో రథయాత్ర నిర్వాహకుని సూచనల మేరకు మోకులను పట్టుకుని భక్తులు రథాన్ని కదలిస్తారు.రథాన్ని ఎక్కడ నుండి లాగి ఉత్సవాన్ని ప్రారంభం చేస్తారో మళ్ళీ యథా స్థానానికి వచ్చే వరకు భక్తులు చిన్న,పెద్ద తేడా లేకుండా త్రాడు సాయంతో లాగారు.మహిళలు రథాన్ని లాగడంలో లీనమై గోవిందనామలాతో మొరుమోగించారు. ఈ వైభవం భక్తుల కళ్ళలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

1890 నాటి రథం..

రథోత్సవాన్ని గ్రామ పురవీధుల్లో  ఊరేగుస్తే ఆ పురవీధులను పీడిస్తున్న దుష్ట శక్తులు, గ్రహ పీడ దోషాలు దూరం అవుతాయన్నారు.1890 లో చెక్కబడిన రాతి చక్రాలను గౌనీతిమ్మేపల్లి గ్రామానికి చెందిన జయప్ప కుటుంభ సభ్యులు నేడు ఆనవాయితీగా మొదటి పూజలు అందిస్తూన్నారు.అదేవిధంగా గ్రామ పురవీధుల్లో రథం వస్తున్నప్పుడు కడపనత్తం గ్రామానికి చెందిన ఆచార్య కుటుంభ సభ్యులు చక్రాలు నిలుపుదల కోసం చెక్క వేస్తుంటారు.నేటికి ఆ కుటుంభ సభ్యులే సేవలు అందిస్తూన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *