Last Updated:
వేట్లపాలెం మందుగూడి గిడ్డంగిలో అగ్ని ప్రమాదం వల్ల 22 మంది మృతి, కాకినాడ Government General Hospital వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశాంతతకు మారుపేరైన గోదావరి నేల మరోసారి కన్నీటి తడిసింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు చెందిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (Government General Hospital) వర్గాలు మరో ఇద్దరు మృతిచెందినట్లు వెల్లడించాయి. దీంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22కి చేరిందని అధికారులు చెబుతున్నారు. మరో ఇద్దరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం.
పచ్చని పంట పొలాలు, ఆధ్యాత్మిక వాతావరణం, ప్రశాంత జీవనం ఇవన్నీ కలిసిన గ్రామం వేట్లపాలెం. అలాంటి ఊరి మధ్యలో ఉన్న మందుగూడి సామాగ్రి గిడ్డంగిలో ఒక్కసారిగా చెలరేగిన అగ్నికీలలు ఎన్నో కుటుంబాలను చీకటిలోకి నెట్టేశాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నాయి. ఘటనాస్థలంలో వినిపించిన చావు కేకలు ఇప్పటికీ గ్రామాన్ని వెంటాడుతున్నాయి.
చనిపోయిన గోదాత నాని కథ వింటే ఎవరికైనా హృదయం కరిగిపోతుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చి, సాయంత్రం త్వరగా వస్తానన్నాడు.. ఇక మాకు కనిపించలేదు” అంటూ అతని భార్య చాందిని కన్నీళ్లు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి సుష్మిత, బాబు రాహుల్ తమ తండ్రి కోసం అడిగిన ప్రతిసారి సమాధానం చెప్పలేక తల్లికి నరకయాతన. చివరి చూపు కూడా దక్కలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకో కుటుంబంలో పరిస్థితి మరింత దారుణం. తల్లి లేకపోయినా, మానసిక వికలాంగురాలైన కూతుర్ని ఒంటరిగా పెంచుకుంటూ వచ్చిన కడింపల్లి ధనరాజు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి లేడన్న నిజం అర్థం కాక తడబడుతున్న ఆ కూతురి పరిస్థితి చూసి అక్కడున్న వారందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా దిక్కులు కోల్పోయిన కుటుంబాల కష్టాలు చెప్పలేనివి.
ఇటీవల కోనసీమలో జరిగిన ఘటనల తర్వాత, ఇప్పుడు కాకినాడ సమీపంలోని ఈ విషాదం ప్రజలను మరింత కలవరపెడుతోంది. మందుగూడి సామాగ్రి వినియోగంపై భద్రతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అన్న ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాజకీయ ఊరేగింపుల కోసం ఉపయోగించే ఇలాంటి సామాగ్రిపై కట్టుదిట్టమైన నియంత్రణ అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత గోదావరి నేలపై మళ్లీ ఇలాంటి చీకట్లు పడకూడదంటే భద్రతే ఒక్కటే మార్గమని బాధితుల కుటుంబాలు కోరుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


