ప్రవేశ రుసుము కడితేనే వాకింగ్ కి ఎంట్రీ..తిరుపతి అలిపిరిలో వాకర్స్ నిరసన..! తిరుపతి నగరంలోని అలిపిరి మార్గం సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. అలిపిరి సమీపంలో ఉన్న దివ్యారామం నగరవనంలో వాకింగ్ చేయడానికి అటవీశాఖ నెలకు రూ.100 ప్రవేశ రుసుము విధిస్తూ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలంగా ఉచితంగా వాకింగ్‌కు అనుమతించిన ఈ నగరవనంలో అకస్మాత్తుగా రుసుము విధించడం సరైంది కాదని వారు అభ్యంతరం తెలిపారు. #alipiri #tirupati #walkers
Source link


