Tollywood: సాంప్రదాయని సుద్దిని సుద్దపూసని మూవీలో లయ రీఎంట్రీ.. పొట్ట చక్కలయ్యేలా నవ్వుకోవచ్చంట | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Tollywood:శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అన్ని వర్గాలను అలరించేలా సంప్రదాయని సుద్దిని సుద్దపూసని చిత్రం<br>
అన్ని వర్గాలను అలరించేలా సంప్రదాయని సుద్దిని సుద్దపూసని చిత్రం

Tollywood: శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శివాజీ, హీరోయిన్ లయ చిత్ర విశేషాలను పంచుకున్నారు. హీరో శివాజీ మాట్లాడుతూ.. ఇది ఒక విభిన్నమైన డార్క్ కామెడీ చిత్రమని తెలిపారు. “గతంలో లయ-నేను కలిసి చేసిన మూడు సినిమాలను ప్రేక్షకులు ఎలాగైతే ఆదరించారో, ఈ సినిమాను కూడా అలాగే ఆదరించాలని కోరుతున్నాను. సాంకేతిక పరంగా అత్యున్నత ప్రమాణాలు పాటించాం. ముఖ్యంగా సినిమా ఆఖరి 45 నిమిషాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

లయ, శివాజీ కాంబో..

మాస్టర్ రోహన్ పాత్ర అద్భుతంగా నటించాడు” అని పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై స్పందిస్తూ.. “ఒక పక్క ప్రజల కోసం మాట్లాడుతూనే, మరోపక్క కుటుంబాల కోసం సినిమాలు చేస్తాను. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం నా గళం వినిపిస్తూనే ఉంటాను. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి, లేదంటే ఇక్కడి వారు ఉపాధి కోసం మళ్లీ హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్త్రీ వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, అవి తన వ్యక్తిగత భావనలు మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.

వెరైటీ టైటిల్..

హీరోయిన్ లయ మాట్లాడుతూ.. విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నా తాతగారి స్వస్థలం విశాఖ కావడంతో చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ‘ఉత్తర’. భర్త మీద చూపించే అతి ప్రేమ ఎలాంటి ఇబ్బందులకు దారితీస్తుందనే అంశాన్ని కామెడీగా, వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఇది కేవలం ఫ్యామిలీ సినిమా మాత్రమే కాదు, అన్ని వయసుల వారు చూసి ఎంజాయ్ చేసేలా ప్రమోట్ చేయాలని కోరుతున్నాను” అని తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *