QR Codes for Every House: ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. టెక్నాలజీని వాడేస్తోందిగా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

QR Codes for Every House: సీఎం చంద్రబాబు ఇదివరకు తాను మాత్రమే టెక్నాలజీ గురించి ఆలోచించేవారు. ఇప్పుడు రూట్ మార్చారు.. ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇదీ మంచిదే. ప్రజలు టెక్నాలజీని వాడేసుకొని.. ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి కొత్త ప్లాన్ ఏంటి?

ఇంటింటికీ క్యూఆర్ కోడ్
ఇంటింటికీ క్యూఆర్ కోడ్

సీఎం చంద్రబాబు తాను తినేందుకు ఆహారం, నీరు లేకపోయినా ఏమాత్రం ఫీలవ్వరు కానీ టెక్నాలజీ లేకపోతే చాలా ఫీలవుతారు. మొదటి నుంచి ఆయన టెక్ సవ్వీనే. సీఎంగా అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ టెక్నాలజీ ద్వారా ఏం చెయ్యవచ్చు అనే ఆలోచించారు. ఆ దిశగా.. తన పాలనలో చాలా చేశారు. ఇప్పుడు కూడా క్వాంటం వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ, విండ్ పవర్, సోలార్ పవర్.. ఇలా ఫ్యూచర్ మిషన్లను ఇప్పటి నుంచే అమలుచేస్తూ.. ముందుకుసాగుతున్నారు. తాజాగా ఆయన.. ఇళ్లకు క్యూఆర్ కోడ్ తేవాలని డిసైడ్ అయ్యారు. ఇది డిజిటల్ గవర్నెన్స్ పాలనలో కీలక అడుగుగా చెప్పుకోవచ్చు.

ప్రభుత్వం త్వరలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికీ, అపార్ట్‌మెంట్‌కీ, షాపింగ్ కాంప్లెక్సులు, చిన్న షాపులు.. ఇలా అన్నింటికీ క్యూఆర్ కోడ్‌లను ఇవ్వనుంది. వాటిని అక్కడే అంటించనుంది. ఇలా మొత్తం 45 లక్షల క్యూఆర్ కోడ్‌లను అతికించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అంటే త్వరలో మనం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్‌లే కనిపిస్తాయి. గుడిలో, బడిలో, ఆస్పత్రిలో, షాపుల్లో, ఇళ్లలో అంతా క్యూఆర్ మయం అవుతుందిు.

త్వరలో మన ఇళ్లకు మున్సిపల్ అధికారులు లేదా సిబ్బంది వస్తారు. ఎక్కడ క్యూఆర్ కోడ్ అతికించాలో చూస్తారు. వర్షం పడకుండా, పాడవకుండా ఉండే చోటు చూసి.. అక్కడ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అంటిస్తారు. మామూలుగా మనం షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. ఎంత డబ్బు చెల్లించాలో కనిపిస్తుంది. కానీ.. మన ఇళ్లకు అంటించే క్యూఆర్ కోడ్ అలాంటిది కాదు. అది మరో రకం.. దాన్ని స్కాన్ చేస్తే.. మన ఇంటి వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. మన ఆస్తుల వివరాలు తెలుస్తాయి. ఎంత టాక్స్ చెల్లించాలి, ఇదివరకు ఎంత చెల్లించారు? ఎవరైనా చెల్లించకుండా పెండింగ్ ఉంచారా, ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ పెండింగ్ ఉందా వంటివి తెలుస్తాయి. అప్పుడు వెంటనే చెల్లింపులు చెయ్వవచ్చు. అంతా క్షణాల్లో అయిపోతుంది.

ఇంటి నుంచే ఆస్తి పన్ను చెల్లింపు:

ఇప్పుడు ఆస్తి పన్ను చెల్లించాలంటే.. మున్సిపల్ ఆఫీసుకి వెళ్తున్నారు చాలా మంది. ఇళ్లకు క్యూఆర్ కోడ్‌ అంటించాక.. దానిని స్కాన్ చేసి.. పన్ను చెల్లించేయవచ్చు. ఇందుకోసం UPI, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ విధానాల్లో దేనినైనా వాడొచ్చు. వ్యాపార లైసెన్స్ పొందడానికి చెల్లించే ఫీజును కూడా ఇలాగే చెల్లించవచ్చు. అందువల్ల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. మరిన్ని బెనెఫిట్స్ కూడా ఉన్నాయి. మన ఇంటి దగ్గర చెత్త ఉంటే.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. డ్రైనేజీ లీక్ అయినా, పారిశుధ్య సమస్య ఉన్నా.. అలాంటి వాటికి కూడా స్కాన్ చేసి పిర్యాదు చెయ్యవచ్చు. అంతేకాదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫొటోలు కూడా అప్‌లోడ్ చెయ్యవచ్చు. అలా చేసినప్పుడు.. ఈ కంప్లైంట్.. వాట్సాప్ పురమిత్ర లోకి వెళ్తుంది. అప్పుడు అది.. అధికారులకు.. హాట్ స్పాట్ లాగా కనిపిస్తుంది. దాంతో వాళ్లు 3 రోజుల్లోనే దాన్ని పరిష్కరిస్తారు.

క్యూఆర్ కోడ్ విధానం నిజానికి కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రం దీన్ని సిటీ సర్వీసెస్ అనే పేరుతో నిర్వహిస్తోంది. దీన్ని పూర్తిగా అమల్లోకి తేవడం ద్వారా.. మీసేవా కేంద్రాల అవసరాన్ని తగ్గించేలా ప్లాన్ ఉంది. అప్పుడు ప్రజలు మున్సిపల్ ఆఫీసులు, మీసేవా కేంద్రాలకు వీలైనంతవరకూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ క్యూఆర్ కోడ్ల తయారీ పనులు జరుగుతున్నాయి. దశలవారీగా రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. అందుకు కచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.

క్యూఆర్ కోడ్ ఎలా పొందాలి?:

ఈ క్యూఆర్ కోడ్ కోసం మనం ఎవర్నీ అడగాల్సిన పని లేదు. ఏదో ఒక రోజు మున్సిపల్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ద్వారం లేదా గోడపై స్టిక్కర్ అంటిస్తారు. ఇక ఆ తర్వాత మనం డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిపోయినట్లే. మన టైమ్ సేవ్ అవుతుంది. టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడేసుకుంటూ.. ముందుకు వెళ్లిపోతాం.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *