AP Political News: టీడీపీలో ఆ ముగ్గురుకి కీలక పదవులు.. ఉత్తరాంధ్రకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం ఇదే  | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలకు మేలు చేయడంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది.  

AP POLITICS
AP POLITICS

AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా సామాజికవర్గాల సమీకరణతో పాటు ప్రాంతీయ అభివృద్ది , పార్టీ పటిష్టతను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలకు మేలు చేయడంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. ఈ తతంగం అంతా ఈ ఉగాది పండుగలోపే పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరి ఉత్తరాంధ్రకు చెందిన నాయకుల్లో అధికార పార్టీ చెప్పబోయే గుడ్ న్యూస్ ఏ నేతలకు వరంగా మారుతుందో అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం ఇప్పటికే ఆ ముగ్గురు నేతల పేర్లు కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఉగాదిలోపే శుభవార్త..

ఉత్తరాంధ్రలో కీలకమైన ముగ్గురు నేతలకు టిడిపి మంత్రులని చేయనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు, విశాఖ గాజువాక ఎమ్మెల్యే ఏపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ భీమిలి ఎమ్మెల్యే, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ముగ్గురిలో ఒకరు మాత్రమే మంత్రిగా ఉండగా.. ఇప్పుడు మిగిలిన ఇద్దర్ని కూడా మంత్రులుగా చేయాలని భావిస్తోంది పార్టీ హైకమాండ్. అంతే కాదు మంత్రిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడికి మళ్లీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెడతారనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఇది పదవుల పంపకం దాదాపు ఖరారైనట్లే అంటోంది టిడిపి కేడర్. అయితే ఈ పదవుల్ని ఉగాది తర్వాత ఇస్తారా ఉగాది లోపే ఇస్తారా అనేది విషయం తేలాల్సి ఉంది.

బీసీ నేతకు క్యాబినెట్ బెర్త్..!

ముఖ్యంగా విశాఖ వరకు చూస్తే పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి యోగం ఉందట. అలాగే అటు గంట శ్రీనివాసరావు కూడా ఎన్నాళ్ళ నుంచో మంత్రి పదవి కావాలని టిడిపి అధిష్టానాన్ని కోరుతున్నారు. వీరిద్దరికీ కూడా మంత్రి పదవులు కేటాయించే ఆలోచనలో ప్రస్తుతం టిడిపి అధిష్టానం ఉంది. ప్రస్తుతం టిడిపి అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావును మంత్రి పదవి ఇచ్చి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచెన్ననాయుడుకు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇద్దామని నిర్ణయించుకుందట టిడిపి. అచ్చెనాయుడుకి రాష్ట్ర అధ్యక్షుడు హోదా ఇవ్వడం ద్వారా పార్టీని గాడిలో పెట్టవచ్చని అలాగే పార్టీ కార్యక్రమాలు కూడా బాగుంటాయని భావిస్తుందట. ఇటు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల బీసీలకు మంత్రి పదవి ఇచ్చిన భరోసా దక్కుతుంది. అలాగే టిడిపిలోని చాలా వరకు “అసంతృప్తులు” ఉన్న నేతలు అందరికీ కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని భావిస్తోందట.

గంటా పంట పండినట్లేనా..?

ఇక మంత్రి పదవి కేటాయించడం ద్వారా గంటా శ్రీనివాసరావు కూడా హ్యాపీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వైసిపి అధికారులు ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు గెలిచారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కూడా ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత లేదు.  ఇప్పుడు కూటముల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న మంత్రి పదవి లేదని ఆయన మదన పడుతున్నారు. మంత్రి పదవి లేదనే విషయాన్ని ఆయన నేరుగానే చంద్రబాబు నాయుడు ఇతర నెలలతో చర్చించారట. అలాగే కాపు సామాజి వర్గానికి చెందిన తనకు పదవి కేటాయించడం ద్వారా ఆ వర్గాల అందరికీ మేలు జరుగుతుందని కూడా గంటా శ్రీనివాసరావు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఉత్తరాంధ్రలో పదవులు కొంత మారుతూ… పదవులు కొంతవరకు కొత్తగా కేటాయించడం జరుగుతోందట. దీంతో టీడీపీ కేడర్ లో కొత్తగా నూతన ఉత్సాహం నెలకొంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *