Last Updated:
Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది.
Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది. రోజు రోజుకి ముదురుతున్న ఎండలతో విశాఖపట్నంలోనే 30 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం ఏపీలో మరికొద్ది రోజుల్లో మరింత ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రస్తుతం ఎండలు ముదిరిపోతున్నాయి. వేసవి పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు తీవ్రమైన ఎండ విశాఖపట్నంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఎక్కువ అనిపిస్తోంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి తీక్షణమైన ఎండ మొదలవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భాసుడు భగభగమంటున్నాడు. మార్చి 15 తర్వాత ఈ వాతావరణం మరింత మారుతుందని.. ఎండలు మరింత ఎక్కువై అసలు వేసవి ప్రారంభమవుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారులు వివరిస్తున్నారు.
గత ఏడాది కంటే ఏడాది ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని అంటున్నారు. గతేడాది గరిష్ట ఉష్ణోగ్రతలు 42,43 డిగ్రీలు దాటాయి. అయితే ఈ ఏడాది 45 డిగ్రీల వరకు ఉంటుందని రాయలసీమలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. అలాగే ఉత్తర కోస్తాల్లో ఎక్కువగా ఎండ ఉన్నప్పటికీ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరైన వాతావరణం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని అత్యవసరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయటకు రాకూడదని అంటున్నారు.
అయితే మార్చి 15 నుంచి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వివరిస్తున్నారు. ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం అవసరం ఉంటే గొడుగులు లేదా ఇతరత్రా ఎండ నుంచి ఉపశమనం కలిగించే వస్తువులు వాడాలని అంటున్నారు. కాగా శని ఆదివారాలు ఎక్కువగా ఎండలు ఉంటాయని శనివారం దాదాపు 32° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని అంటున్నారు. బంగాళాఖాతంలో ఉన్న పీడనం అంతగా బలపడకపోవడంతో ప్రస్తుతం వానలు తగ్గుతాయి అని అంటున్నారు. ఈ సండే నిజంగానే సన్ దగ్గరగా ఉండే డేగా ఉంటుందని వివరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువగా ఎండల్లో తిరగద్దని వివరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


