Summer Tips: ఏసీ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీ గదికి ఎన్ని టన్నుల ఏసీ సరిపోతుందో తెలుసా.. ఇలా తెలుసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఈశ్వర్ సూచనల ప్రకారం, గది పరిమాణం బట్టి టన్ను AC ఎంచుకుంటే మంచి కూలింగ్, కరెంట్ బిల్లు ఆదా. ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభమై ఏసీలకు డిమాండ్ పెరిగింది.

Rapid Read
+

ఈ

ఈ సమ్మర్ కి ఏసీ కొంటున్నారా? మీ ఇంటి సామర్థ్యాన్ని బట్టి ఇలా తీసుకోండి

ఫిబ్రవరి లోనే సమ్మర్ మొదలైపోయింది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్తే భానుడు భగభగమంటూ  తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక మంది ఏసీలు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. వేసవి సమీపించడంతో ఏసీలకు మంచి డిమాండ్ పెరిగింది. అయితే  ఏసీ తీసుకుంటే బాగుంటుందని చాలావరకు సందేహాలు ఉంటాయి. చిన్న ఏసీ తీసుకోవాలా? పెద్ద ఏసీ తీసుకోవాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. బడ్జెట్ తగ్గట్టు ఏసీ తీసుకుంటే సరిపోతుందని మరికొంతమంది ఆలోచిస్తూ ఉంటారు.  ఏసీలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు ఏసీ టెక్నీషియన్స్.

బెడ్ రూమ్ సైజ్ బట్టి ఏసీ తీసుకోవాలి అంటున్నారు ఏసీ టెక్నీషియన్స్. అయితే ఏసీల సామర్థ్యాన్ని టన్నులతో కొలుస్తారు. మీ ఇంటి సామర్థ్యం బట్టి ఏసీని కొనుగోలు చేయాలని లేదంటే ఏసీ రాకపోగా భారీగా కరెంట్ బిల్లు వస్తుందని విశాఖపట్నంలోని ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ అంటున్నారు. రూమ్‌ని బట్టి ఏసీ కొనుగోలు చేస్తే కరెంట్ ఆదా అవుతుందని ఈశ్వర్ అంటున్నారు.

ఏ గదికి ఎంత సామర్థ్యం ఉన్న ఏసీని కొనాలో ఓ లుక్కేద్దాం రండి. మీ గది పరిమాణం 150 చదరపు అడుగులు అయితే.. 1 టన్ ఏసీ కరెక్ట్‌గా సరిపోతుంది. 150 నుంచి 250 చదరపు అడుగుల గదికి, 1.5 టన్ను AC సరిపోతుంది. 250 నుంచి 400 చదరపు అడుగుల గదికి, 2 టన్నుల ఏసీ ఖచ్చితంగా సరిపోతుంది. 400 నుంచి 600 చదరపు అడుగుల గదికి 3 టన్నుల AC సరైనది అని అంటున్నారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే లో అధిక శాతం ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉక్కపోత మొదలైంది. భానుడు వేసవి తాపానికి ఏసీ కొనుగోలు ఎక్కువైంది. చాలా మంది వేడి నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఏసీని ఎంచుకుంటున్నారు. పైన తెలిపిన విధంగా ఇంటి సామర్థ్యాన్ని బట్టి ఏసీ కొనుగోలు చేస్తే మంచి కూలింగ్ వస్తుందని అంటున్నారు. కరెంట్ బిల్లు ఆదా అవుతుందని అంటున్నారు. ఈ సమ్మర్ కి ఏసీ కొనుక్కుంటే ఈ విధంగా కొనుక్కోండి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *