Last Updated:
Tiger Facts: దేశంలో పెద్దపులులకు సంబంధించి వాటి సంఖ్య అతి తక్కువగా ఉంది. వాటిలో ప్రధానంగా ఏపీ, తెలంగాణలో విస్తరించి ఉన్న నల్లమల్ల ఫారెస్ట్‌లో 60కి పైగా పెద్ద పులులు ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు ఒక అంచనా వేశారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు.
Tiger Facts: దేశంలో పెద్దపులులకు సంబంధించి వాటి సంఖ్య అతి తక్కువగా ఉంది. వాటిలో ప్రధానంగా ఏపీ, తెలంగాణలో విస్తరించి ఉన్న నల్లమల్ల ఫారెస్ట్‌లో 60కి పైగా పెద్ద పులులు ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు ఒక అంచనా వేశారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. అందుకే ఉభయగోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతంలోని పాపికొండలు గోదావరి దట్టమైన అటవీ ప్రాంతాన్ని టైగర్ జోన్‌గా తయారు చేసేందుకు రెండు ఆడ పులి పిల్లలను సైతం త్వరలో ఇక్కడ విడుదల చేస్తామని రాజమండ్రి ఫారెస్ట్ ప్రధాన అధికారి కంఠానాథరెడ్డి స్పష్టం చేశారు. అరుదైన, అంతరించిపోతున్న క్రూరమృగాల్లో పులులు ప్రధానమైనవి. ఈ పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకే పెద్దపులిని పాపికొండలు దగ్గరున్న దట్టమైన అడవిలోకి వదలడం జరిగిందని ప్రస్తుతం జనాలు నివసించే ప్రాంతాల్లోకి వచ్చిందంటూ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. వాటిలో వాస్తవం లేదని కేవలం ఆడ పులి కోసం మాత్రమే ఒక మగపులి అన్వేషిస్తోందని కంఠానాథరెడ్డి తెలిపారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో పెద్దపులికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అధికారులు వెర్షన్ ఒకరకంగా ఉంటే ప్రజలు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో ఇప్పుడు పెద్దపులి భయం అక్కడి ప్రజల్ని నిద్రపోనివ్వడం లేదు. ఏ క్షణంలో ఊరిపై పడి మనుషులపై దాడి చేస్తుందో అనే టెన్షన్ ప్రతీ ఒక్కరిలో ఉంది. పాపికొండలు ఫారెస్ట్ పెద్ద పులులకు అనుగుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పెద్దపులి వాటి జీవన విధానంలో భాగంగా అటవీ ప్రాంతం చుట్టూ తిరగడం ప్రారంభిస్తూ ఉంటాయి. గత రెండు సంవత్సరాల కిందట కూడా గోదావరి జిల్లాలో పెద్దపులి దాదాపు నెలరోజులు తిరిగింది. తర్వాత డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయింది. అయితే గత నెల రోజుల కిందట ఏపీలో ముప్పతిప్పలు పెట్టిన పెద్దపులిని తూర్పుగోదావరిజిల్లాలో అధికారులు బంధించారు. విశాఖ జూకు తరలించారు. అక్కడి నుంచి ఈ పెద్దపులిని ఎక్కడ రిలీజ్ చేయాలి అన్న విషయంపై అధికారులు రెండు ఆలోచనలు చేశారు. ప్రధానంగా నల్లమల్ల ఫారెస్ట్ లో వదిలేద్దామని మొదట అనుకున్నప్పటికి అక్కడ పులుల సంఖ్య 60 కి పైగా ఉన్న నేపథ్యంలో వీటికి ఆహారం వాటర్ అనుగుణంగా ఉన్న ప్రాంతంగా పాపికొండలు అభయారణ్యం బాగుంటుందని ఆలోచనతో ఈ పెద్దపులిని ఇక్కడ వదిలేసారని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అయితే తాజాగా రెండు రోజులకు ముందు ఓ రంపచోడవరం సమీప ప్రాంతానికి పెద్దపులి వచ్చినట్లుగా అక్కడ అధికారులు , స్థానికుల సైతం పేర్కొంటూ ఉండగా రాజమండ్రికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు మాత్రం ఫారెస్ట్ లోనే ఉండి ఎక్కడ ప్రజలకు సంబంధించిన ప్రాంతంలోకి రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ పెద్దపులి కేవలం తన తోడుకోసం ఆడపులికోసం మాత్రమే అన్వేషిస్తూ తిరుగుతోందని రాజమండ్రి ఫారెస్ట్ చీప్ కన్జర్వేటర్ కంఠనాథరెడ్డి పేర్కొన్నారు. అలా ఆడపులి దొరికే వరకు దాని ప్రయాణం కొనసాగిస్తుందని స్పష్టంచేశారు.
ఇదే సమయంలో దట్టమైన అటవీ ప్రాంతమైన పాపికొండలు అరణ్యంలోకి త్వరలో రెండు ఆడ పులులను వదిలే ప్రయత్నం చేస్తామని తద్వారా పులుల సంఖ్య సైతం పెరుగుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి గోదావరి జిల్లాల శివారు ప్రాంతమైన రంపచోడవరం సమీపాన దేవిపట్నం నుంచి ప్రారంభమయ్యే ఈ పాపికొండలు అభయ అరణ్యం అతి పెద్దదిగా విశాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనేక అడవి జంతువులు ఉన్నప్పటికీ పులులు ఉన్నట్లుగా జాడ లేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మగ పులి ఉన్న నేపథ్యంలో ఆడపిల్లను అక్కడ వదిలితే వీటీసంతాన ఉత్పత్తి పెరిగి పెద్దపులులు సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుత పెద్దపులి అప్టేట్ విషయానికి వస్తే నిన్నటి వరకు రంపచోడవరం సమీప ప్రాంతాల్లో ఉందని అంచనా వేసిన అధికారులకు మరి ఏ సమాచారం వచ్చిందో ఏమో గానీ అసలు పెద్దపులి రాలేదని అడవిలోనే సంచరిస్తున్నట్లుగా వెల్లడించారు. అయినప్పటికీ పులి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి ఒకవేళ డీప్ ఫారెస్ట్ గుండా వెళితే పరవాలేదు కాదని మళ్లీ అడవికి సమీప ప్రాంతంలోకి వస్తే కచ్చితంగా మూగజీవాలపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాపికొండలు అభయారణ్యం ఉన్న పెద్దపులి చత్తీస్ఘడ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మీదగా ప్రయాణం కొనసాగించినా ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టలేదంటూ అధికారులు స్పష్టం చేశారు. దాని ఆలోచన విధానం అంతా ఆడపులిపై మాత్రమే ఉందని ఆ ఆడపులులు త్వరలో పాపికొండలు అభయారణ్యంలో వదిలేందుకు ఫారెస్ట్ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Rajahmundry,East Godavari,Andhra Pradesh


