Pencil Portrait Artist: అతను పెన్సిల్‌‌తో బొమ్మ గీస్తే కలర్ ఫోటో కూడా పనికి రాదు.. వీడియో ఇదిగో | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Pencil Portrait Artist: మనం చక్కగా ఒక దగ్గర కూర్చున్నామా అంతే మన రూపాన్ని ప్రతిబింబించే విధంగా అందంగా తక్కువ సమయంలో ఆ కళాకారుడు ఒక తెల్లని పేపర్ పై చకచకా గీసేస్తాడు. ఆ కళాకారుడు రూపాన్ని గీసిన తర్వాత మనం ఇంత అందంగా ఉన్నామా అనే విధంగా ఆ తెల్లని పేపర్ పై మనరూపం అద్భుతంగా ఆకట్టుకుంటుంది.

Rapid Read
+

తెల్లనిపేపర్

తెల్లనిపేపర్ పై అందమైన రూపం, ఇలాంటి కలను ఎప్పుడైనా చూసారా

Pencil Portrait Artist: మనం చక్కగా ఒక దగ్గర కూర్చున్నామా అంతే మన రూపాన్ని ప్రతిబింబించే విధంగా అందంగా తక్కువ సమయంలో ఆ కళాకారుడు ఒక తెల్లని పేపర్ పై చకచకా గీసేస్తాడు. ఆ కళాకారుడు రూపాన్ని గీసిన తర్వాత మనం ఇంత అందంగా ఉన్నామా అనే విధంగా ఆ తెల్లని పేపర్ పై మనరూపం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. టెక్నాలజీ రోజుల్లో డిజిటల్ మిషన్స్ డిజిటల్ కెమెరాలు ఉన్నప్పటికీ కేవలం తన చేతి పెన్సిల్ రాతతో అందాలు పరిమళించే విధంగా వాలు జడలు, ఆపై సొగసులు విరబూసే పూలమాలలు వేసి చూపురాలను ఆకట్టుకుంటున్నాడు ఆ కళాకారుడు. బొమ్మ గీసిన తర్వాత ఆశ్చర్యము పరమానందంతో మాట్లాడటానికి మాటలు రాని విధంగా కళాకారుడి ప్రతిభ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ అలాంటి కళాకారుడు ఎవరు? ఎన్ని సంవత్సరాలుగా ఆయన ఈ కలను నమ్మికుని ఉన్నారు? పేపర్ పై ఈ ఆర్ట్ వేస్తున్నారు? వీడియో స్టోరీ చూడండి.

రవివర్మకు డూప్..

ఈ ఫైజీ టెక్నాలజీ రోజుల్లో మన అందం కనిపించేందుకు..వాటిని ఫోటోల రూపంలో డిజైన్ చేసేందుకు ఎన్నో డిజిటల్ మిషన్ ఫోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కళాకారుడు తెల్లని పేపర్‌పై మీరు కోరుకుంటే చాలు బొమ్మ గీస్తాడు. అది చూస్తే వామ్మో బ్లాక్ అండ్ వైట్ అయినప్పటికీ ఇంత అద్భుతమా అనే విధంగా రూపాన్ని తీర్చిదిద్దుతాడు. గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో పర్యాటక ప్రాంతాలతో పాటు అన్నవరం పుణ్యక్షేత్రంలో సైతం కళాకారుడు రాజు భక్తులకు పర్యాటకులకు అందుబాటులో ఉంటాడు. డబ్బులతో సంబంధం లేకుండా ఎంత ఇస్తే అంతా తీసుకుంటూ ఒక తెల్లని పేపర్ పై ఆ రూపాన్ని కేవలం పది నుంచి 15 నిమిషాల వ్యవధిలో అద్భుతంగా గీసి అవురా అనిపించుకుంటున్నాడు.

బొమ్మలు గీయడంలో ఆయనే రాజు..

కళాకారుడు రాజు కాకినాడజిల్లా అన్నవరం ప్రాంతానికి చెందిన రాజు 26 సంవత్సరాలుగా ఈ వృత్తిని నమ్ముకున్నాడు. కానీ అతను వేసుకున్న వస్త్రధారణ అతనికి కాళ్లకు చెప్పులు కూడా లేని దయానియా పరిస్థితి. కానీ అతని కల మాత్రం దేశం గర్వించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ రూపాన్ని అయినా అతితక్కువ సమయంలో తెల్లని పేపర్ పై వేయడంలో కళాకారుడు రాజుకు సాటి ఎవరూ లేరు. తాజాగా కాకినాడ జిల్లా అన్నవరంలో పలువురి రూపాలు వేసి అందరిని ఆనంద చేశారు.

గ్రేట్ టాలెంట్.. 

డబ్బు, సంపాదన, ఎదగాలి, స్వార్థం అనేవి ఏమీ లేకుండా తన కలనే నమ్ముకుంటూనా కళాకారులను ప్రభుత్వం లేదా స్వచ్చంద సంస్థలు ప్రజలు కూడా బ్రతికించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.వీరి దగ్గరున్న కల కోట్ల రూపాయలతో సమానం కానీ కేవలం 10 నుంచి 100 రూపాయలు మాత్రమే వీరి సంపాదన ఉంటుందని చెప్పుకోవచ్చు, అది లేని రోజులు ఎన్నో ఉంటాయి, చూడటానికి ఎంతో బలహీనంగా చిరునవ్వు నవ్వుతూ చక్కని రూపాన్ని వేస్తూ జీవితాన్ని అలా ముందుకు తీసుకొస్తూ ఉంటారు, 26 ఏళ్లుగా ఇదే కలను నమ్ముకున్న కనీసం తన మెయింటినెన్స్ ఖర్చులు కూడా తీయలేని దయనీయ పరిస్థితిలో కళాకారుడు రాజు ఉన్నారని చెప్పుకోవచ్చు, ఏది ఏమైనా ప్రభుత్వం సైతం ఇలాంటి కళాకారులను గుర్తించి చిరు సత్కార కార్యక్రమాలతో పాటు తగిన బహుమతులు అందిస్తే ఆయన విలువలు మరింత పెరుగుతాయని చెప్పుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *