ప్రపంచంలో ఇప్పుడు చాలా దేశాల్లో పంటలు పండించే విధానాలను మార్చుకొంటున్నారు. ఆరు బయట పొలాల్లో సాగు మానేసి.. భవనాల్లో సాగు చేపడుతున్నారు. దీని వల్ల తుపాన్లు, వర్షాలు, వడగళ్ల సమస్యలేవీ ఉండవు. చీడ పీడల సమస్య ఉండదు. 2, 3 రెట్లు ఎక్కువ దిగుబడి ఉంటుంది. పంట పూర్తిగా రైతు కంట్రోల్‌లో ఉంటుంది. భవనం లోపల ఎంత వేడి ఉండాలి, ఎన్ని ఎరువులు వెయ్యాలి, ఎంత నీరు అందించాలి.. అంతా రైతు కంట్రోల్ లోనే ఉంటుంది. ఇండియాలో కూడా ఈ విధానాలు రావాలి. దీనికి ప్రారంభ పెట్టుబడి లక్షల్లో ఉంటుంది. అది రైతులకు భారం. అందువల్ల ప్రభుత్వాలే రైతులకు ఇలాంటి పెట్టుబడిని అందిస్తే.. ఇక పంట నష్టాలు, పరిహారాలు, రైతులకు కష్టాలు.. ఏవీ ఉండవు. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాల అవసరమే ఉండదు. సాగులో ఈ విప్లవాత్మక మార్పులు తప్పనిసరిగా చెయ్యాల్సి ఉంటుంది. కారణం వాతావరణ మార్పులు.



