Adulterated Milk: రాజమండ్రిలో ప్రాణాలు తీస్తున్న కల్తీపాలు.. మృతుల కుటుంబాలకు సీఎం లక్షల రూపాయల ఆర్ధికసాయం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Rajahmundry Adulterated Milk: ఏపీకి సంబంధించి సంచలనంగా మారిన రాజమండ్రి కల్తీ పాలు ఘటనకు సంబంధించి మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాజమండ్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ డిఎంహెచ్‌వోతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఘటనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

Rapid Read
+

Rajahmundry

Rajahmundry Adulterated Milk

Rajahmundry Adulterated Milk: ఏపీకి సంబంధించి సంచలనంగా మారిన రాజమండ్రి కల్తీ పాలు ఘటనకు సంబంధించి మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాజమండ్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ డిఎంహెచ్‌వోతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఘటనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ ఉదయానికి ఇద్దరు మృత్యవాత పడగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య నలుగురుకి చేరింది. వీళ్లు కాకుండా మరికొంత మంది వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా క్రిటికల్‌గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈవిషయంపై సీరియస్ గా ఉంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉండాలని అత్యవసర వైద్యం అందించేందుకు సర్వం సిద్ధంగా ఉండాలంటూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాజమండ్రి కి సంబంధించి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్, ప్రాంతాలలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఇక మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సైతం ప్రకటించారు.

ఆసుపత్రిలో మరికొందరు..

రాజమండ్రిలోని లాలాచెరువు సమీప ప్రాంతాలలో కల్తీపాలు కారణంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో అనారోగ్య సమస్యలు రావడం ఆసుపత్రి పాలవడం గత కొద్దిరోజులుగా కలకలం రేపుతోంది. దీంతో కిడ్నీలపై ఎఫెక్ట్ చూపించింది. దీంతో ఆసుపత్రి బారినపడ్డారు. అక్కడితో ఆగక మరణాల సైతం ప్రారంభమయ్యాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు పాలు ద్వారానే ఈ సమస్య ఈ ప్రాంతంలో దాపరించిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటివరకు నలుగురు చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో నలుగురు 60 సంవత్సరాల పైబడిన వారి కావడంతో ఎక్కువగా వయసు పైబడిన వారిపై ఈకల్తీ పాలు ప్రభావం చూపిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధితులకు సంబంధించి రాజమండ్రిలో ప్రత్యేక వైద్య శిబిరాలు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లుగా డిఎంహెచ్ ఒ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ముఖ్యంగా చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వరరావు నగర్, బాధితులకు వికారం, వాంతులు, మూత్ర విసర్జనతగ్గడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

పెద్దవాళ్లే బాధితులు..

ఆసుపత్రిలో చేరిన వారిలో అధిక శాతం 60 ఏళ్ల పైబడిన వారిని వెల్లడించారు. వారిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరొపక్క జిల్లా ఎస్పీ ఈఘటనకు సంబంధించి డి.నరసింహ మీడియా సమావేశం నిర్వహించారు, మృతుల పోస్ట్మార్టం నివేదికల రావాల్సి ఉందని అనుమాన స్పదంగా ఉన్న ఒక అనధికారి డైరీ సీజ్ చేసి పాల వ్యాపారి గణేష్ ని అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ అనూర్య వ్యాధిపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మీడియా సమావేశం నిర్వహించారు. 70 కి పైగా శాంపిల్స్ టెస్టులకు పంపించినట్లుగా తెలిపారు, రిపోర్ట్లు రాగానే వీటికి గల కారణాలు బహిర్గతం అవుతాయని స్పష్టం చేశారు.ఏది ఏమైనా ప్రశాంతతకు మారుపేరైన రాజమండ్రిలో ఈ కల్తీపాలు కారణంగా మరణాల సంఖ్య కొనసాగుతుంది, మరిచూడాలి నేటి రాత్రికి ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అన్నది.

ఒక్కొక్కరికి  10 లక్షలు ఎక్స్గ్రేషియా..

రాజమండ్రి లాలాచెరువు సమీప ప్రాంతాలలో కల్తీ పాలు కారణంగా చనిపోయిన నలుగురికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది, ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు వైయస్ షర్మిల తో పాటు పలువురు చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *