Fake Milk: చిక్కని పాల పేరుతో విషం విక్రయం.. ఇద్దరు మృతి, 15మంది ఆసుపత్రి పాలు | ట్రెండింగ్


Last Updated:

Fake Milk:తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఆ ప్రాంతంలో ప్రజలు మారినట్లుగా సమాచారం అందుతుంది.

Rapid Read
+

ఏపీలో

ఏపీలో కల్తీపాలు ఇద్దరు మృతి వరుసుగా ఆసుపత్రి బాట పడుతున్న ప్రజలు

Fake Milk: తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఆ ప్రాంతంలో ప్రజలు మారినట్లుగా సమాచారం అందుతుంది, ఇప్పటివరకు ఈ కల్తీ పాలు కారణంగా ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తుంది, అయితే అధికారులు మాత్రం ఒక్కరే చనిపోయారంటూ పేర్కొంటున్నారు. కేవలం రాజమండ్రి కి సంబంధించి రెండు ప్రాంతాల్లో అత్యధికంగా ఈ సమస్యతో ప్రజలు ఆసుపత్రి బారిన పడుతున్నట్లు స్థానికులు తెలిపారు,అసలు కల్తీపాలు వ్యవహారం ఏంటి?అధికారులు మరేం చేస్తున్నారు? రాజమండ్రిలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.

చిక్కని పాల పేరుతో విషం..

ప్రశాంతతకు మారుపేరైన తూర్పుగోదావరిజిల్లాలో కల్తీపాల వ్యవహారం ఒక్కసారిగా ప్రజలను ఆందోళనకు గురి చేసింది, కోరుకొండ సమీప ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రాజమండ్రి లాలాచెరువు చౌడేశ్వరిపేట సమీప ప్రాంతాలలో పాలు నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తారు,అయితే ఈపాలు సేవించిన తర్వాత ఒక్కసారిగా ప్రజలు ఆరోగ్యం క్షీణించింది, ముఖ్యంగా మగవారికి మూత్రపిండాల సమస్య రావడం ఆడవారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభమయ్యాయి, ఇవి ఎక్కువ కావడంతో చనిపోయే వరకు పరిస్థితులు దారితీసాయి. రాజమండ్రి కి సంబంధించి ఇద్దరు చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది,ఇక విషయం తెలుసుకున్న అధికారులు పాల వ్యాపారిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది, అయితే ఏ కోణంలో ఈ పాలులో కల్తీ జరిగింది అన్న విషయంలో కూడా అధికారులు ఆరాధిస్తున్నారు ఏది ఏమైనా కొందరు వెంటిలేటర్ పై సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,మరికొందరు ఆసుపత్రిబాటపడుతున్నారు.

15 మంది ఆసుపత్రి పాలు..

ఇప్పటివరకు 15 మందికి పైగా ఈ వ్యాధి సోకింది.ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ సైతం అత్యవసర సమీక్ష నిర్వహించారు అనూరియా వ్యాధి వ్యాధి చెందుతుందని ఇలాంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, ఎప్పటికప్పుడు అధికారులు ఈ వ్యాధిపై పర్యవేక్షిస్తున్నట్లుగా తెలియజేశారు, అయితే మరోపక్క ఈ వ్యాధి పాలు ద్వారా జరిగిందా మరి ఇతర కారణాలు అన్న ఉన్నాయా అన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు, ముఖ్యంగా కోరుకొండ సమీప ప్రాంతానికి చెందిన వ్యక్తి దాదాపుకాలంగా రాజమండ్రి లాలాచెరువు సమీప ప్రాంతాలకు పాలు వేస్తున్నారని, ప్రాథమికంగా పాలు ద్వారానే ఈ వ్యాధి సోకిందంటూ అధికారులు నిర్ధారించారు ఇలాంటి తరుణంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు, ప్రస్తుతం రాజమండ్రి మరియు ప్రాంతాన్ని ఈ కల్తీ పాలు ఘటన కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు.

మృతులు మహిళలే..

చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలుగా తెలుస్తుంది, మరి కొంతమంది చిన్నార్లకు సైతం ఈ సమస్య వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు, ప్రస్తుతం ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రిలో పలువురు చికిత్స పొందుతున్నారు, కేవలం ఒక వ్యక్తి ఈ విధంగా పాలలో కల్తీ చేశారు అంటూ పలువురు పేర్కొంటున్నారు, ఏది ఏమైనా గోదావరి జిల్లాలో పాలు తాగుతున్నారా కచ్చితంగా అవి ఎలాంటి ఫాలో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *