15 మంది ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ట్రిపుల్ ఐటీ కి ఎంపిక


.. హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో 15 మంది ట్రిపుల్ ఐటీ కు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ పరీక్షలకు మా పాఠశాల ఉపాధ్యాయులే చక్కటి శిక్షణ ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఇప్పటికే పట్టణంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ర్యాంకులు సాధించి, మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. ఈ ట్రిపుల్ ఐటీలో ఎంపికైన వారికి ఆరు సంవత్సరాలు ఉచిత వసతితో పాటు బీటెక్ వరకు చదివే అవకాశం ఉంటుందని తెలిపారు. ట్రిపుల్ ఐటీ లో సాధించిన విద్యార్థులలో భవ్యశ్రీ, అక్షయ, జాహ్నవి, తేజశ్రీ, జయలక్ష్మి, జ్యోతి స్వరూప, సుమియా, ఉమేష్నా అంజుమ్, ప్రణతి, భవ్య శ్రీ, యశస్విని, గాయత్రి, భవ్య ,కరిష్మా, మౌనిక భాయి ఉన్నారని తెలిపారు. ఈ విద్యార్థులందరికీ హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందము, పాఠశాల చైర్మన్ బాబావలి, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *