వీరికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్


10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది 2015 నుంచి ఉన్న రూలే అయినప్పటికీ, ఇప్పటివరకు వినియోగదారుల వ్యక్తిగత డిక్లరేషన్‌పై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నేరుగా పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కేవలం కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయమే కాదు.. భార్యాభర్తల్లో ఎవరి ఆదాయం రూ. 10 లక్షలు దాటినా ఆ కుటుంబం సబ్సిడీకి అనర్హమవుతుంది. ఇప్పటికే ఐటీ రికార్డుల ప్రకారం అనర్హులుగా తేలిన వారికి ఆయిల్ కంపెనీలు మెసేజ్‌లు పంపిస్తున్నాయి. 7 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపకపోతే ఆటోమేటిక్‌గా సబ్సిడీ కట్ అయిపోతుంది. ఈ నిబంధనల వల్ల సామాన్యులకు లేదా పేదలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఃప్రధానమంత్రి ఉజ్వల యోజనః లబ్ధిదారులకు ఈ రూల్ వర్తించదు. వారికి వచ్చే సబ్సిడీ యథావిధిగా అందుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *