వీడిన రెండాకులు


రెండుగా చీలిన అన్నాడీఎంకే
సీఎం విజయ్‌కు మద్దతు తెలిపిన షణ్ముగం వర్గం

చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి అన్నాడీఎంకేలు అలజడి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామికి, షణ్ముగంనకు వర్గ పోరు మొదలైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు క్యాంపు రాజకీయాలకు దారితీసింది. 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం క్యాంపు రాజకీయాలు నడిపించారు. ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే…అప్ప్పుడు విజయ్ అందుకు సుముఖంగా లేరని తెలిసింది. అనంతరం విజయ్… కాంగ్రెస్, వామపక్షాలు, సీవీకే మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయినా…అన్నా డీఎంకేలో విభేదాలు తగ్గలేదు. ఇప్ప్పుడు బహిర్గతం అయినాయి. ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తోన్న ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు షణ్ముగం నేతృత్వంలోని చీలిక వర్గం విజయ్‌కే జయ్‌కొట్టింది. ఈ పరిణామాల గురించి అక్కడ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతునే ఉంది. ఇప్ప్పుడు ఆ చర్చలకు తెరపడి విభేదాలు బహిర్గతమైనాయి. ఎన్నికల అనంతంర తమిళ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఓటములే కారణం: షణ్ముగం
కొన్నేళ్లుగా అన్నాడీఎంకే చవిచూస్తోన్న ఓటములే ఈ మార్పునకు కారణమని షణ్ముగం వెల్లడించారు. ‘ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేను ఏర్పాటుచేశాం. 53 ఏళ్లుగా మా రాజకీయాలు ఆ దిశగానే కొనసాగాయి. కానీ డీఎంకే మద్దతుతో ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన వచ్చింది. మెజార్టీ సభ్యులు దానిని తిరస్కరించారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే… అన్నాడీఎంకే ఉనికే లేకుండాపోతుంది. ప్రస్తుతం మేం ఎలాంటి పొత్తులో లేము. ఇప్ప్పుడు మా దృష్టి అంతా అన్నాడీఎంకేను పునరుద్ధరించి, బలోపేతం చేయడంపైనే ఉంది. చివరకు టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది’ అని వెల్లడించారు.

The post వీడిన రెండాకులు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *