వాల్మీకి ప్రతిభా అవార్డ్స్ కు దరఖాస్తు చేసుకోండి..


ధర్మవరం వాల్మీకి ఉద్యోగుల సంఘం
విశాలాంధ్ర ధర్మవరం::శ్రీసత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం 2025- 26 సం,, ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమం, ధర్మవరం శిరిడి సాయిబాబా కళ్యాణమండపం నందు ధర్మవరం నియోజకవర్గ వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మే 31 వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించుటకు సిద్దమైంది.
సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మికులు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును అని వాల్మీకి ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. ప్రతిభాఅవార్డులకోసం* దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు పదవ తరగతి
ప్రభుత్వ పాఠశాలల్లో 450మార్కులు పైగా తెచ్చుకున్న వారు అలాగే ప్రైవేటు పాఠశాలల్లో 500మార్కులు పైగా తెచ్చుకున్న వారు, అదేవిధంగా ఇంటర్లో ప్రభుత్వ కాలేజీలలో 750పైగామార్కులు తెచ్చుకున్న వారు అలాగే ప్రైవేటు కాలేజీలలో 850పైగామార్కులు తెచ్చుకున్న వారు అర్హులు అని తెలిపారు. అదేవిధంగా శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు కూడా వాల్మీకి సంఘ నాయకులు సన్మానం చేయనున్నారు అని తెలిపారు.
దరఖాస్తు చేయి చేసుకొనేవారు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆర్థిక కార్యదర్శి ఈశ్వరయ్య , సీనియర్ నాయకులు బి కే ముత్యాలప్ప ,సత్య సాయి జిల్లావాల్మీికి సంఘం ఆర్ధిక కార్యదర్శి .రామకృష్ణ , ధర్మవరం నియోజక వర్గవాల్మికి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు జెన్నే నాగప్ప, అద్యక్షులు .నరసింహులు, ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తో పాటు సీనియర్ నాయకులు నాగరాజు, వెంకటేష్ ,శివయ్య, పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.దరఖాస్తు చేసుకొను విద్యార్థులు క్రింద తెలిపిన వాట్సాప్ నెంబర్లకు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తోపాటు మార్కుల పత్రం పంపించవలసిందిగా తెలిపారు. వాట్సాప్ నెంబర్లు చంద్రశేఖర్…9652800038,నరసింహులు 9394798674. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *