‘లెనిన’ కోసం నీ కష్టం నాకు తెలుసు: నాగచైతన్య


సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన హీరో
సినిమా:
తన తమ్యుడు అఖిల్‌ను హీరో నాగచైతన్య ప్రశంసలతో ముంచెత్తారు. త్వరలో విడుదల కాబోతున్న ‘లెనిన’ హీరో అఖిల్ ఎంతో కష్టపడ్డాడని కొనియాడారు. తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌పై టాలీవుడ్ హీరోలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉందన్న నాగచైతన్య….ఈ చిత్రం కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ‘లెనిన్ కోసం నువ్వు (అఖిల్) ఎంత ఎంత కష్టపడి పని చేశావో నేను దగ్గర్నుంచి చూశాను. ఈ చిత్రం నీకు గొప్ప విజయాన్ని ఇస్తుందన్న నమ్మకం నాకుంది’ అంటూ నాగచైతన్య శుభాకాంక్షలు తెలిపారు. ‘లెనిన’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నటుడు అఖిల్. మూడేళ్ల తర్వాత వస్తున్న ఈ చిత్రంతో కచ్చితంగా హిట్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ట్రైలర్ అదిరిపోయిందన్న ఆది సాయికుమార్… తమన్ అందించిన మాస్ బ్యాక్‌గ్రౌండ్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందన్నారు. 10వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు కానుందని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మహాభారతం స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్ ఆధారంగా తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *