రాజాం ఎంపీడీవో సేవలకు పురస్కారం


విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజాం ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావుకు ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల పారదర్శక నిర్వహణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో ఆయన చూపిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీనివాసరావును అభినందించారు.

The post రాజాం ఎంపీడీవో సేవలకు పురస్కారం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *