అబుదాబి: ఇజ్రాయిల్ తన ప్రధాన రక్షణ వ్యవస్థ ఐరన్ డ్రోమ్ వ్యవస్థను మొదటిసారి విదేశాలకు పంపించింది. ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు సైనిక సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పంపించింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇతర ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా యూఏఈపై నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులను యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో అడ్డుకుంది. కానీ కొన్ని ఇరాన్ ఆయుధాలు కీలక మౌలిక వసతులపై దాడులు చేయడంతో యూఏఈ మిత్ర దేశాల సాయం కోరింది. దీంతో ఇజ్రాయిల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థను యూఏఈకి పంపించింది. దానిని ఆపరేట్ చేసి రాకెట్లు, డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ దళాలను కూడా పంపించింది. ఇరాన్ దాడులు పెరగడంతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఐరన్ డోమ్ వ్యవస్థను యూఏఈకి తరలించాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఇరాన్‌కు ప్రధాన టార్గెట్‌గా మారిన అబుదాబికి భారీ ఊరట లభించింది.
The post యూఏఈకి ఇజ్రాయిల్ ‘ఐరన్ డోమ’ appeared first on Visalaandhra.


