మారుతి సుజుకి 5 స్టార్ట్‌ అప్‌లతో భాగస్వామ్యం


న్యూదిల్లీ : కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి, వినియోగదారుల అనుభవాన్ని ఉన్నతీకరించడానికి, పలు వ్యాపార రంగాలలో పరిష్కారాలను సంయుక్తంగా రూపొందించేందుకు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మినీమైన్స్‌, ఈజ్వర్క్ ఏఐ, సర్వం ఏఐ, సిఫ్ట్లీ, కోడ్మేట్ ఏఐ అనే ఐదు స్టార్ట్‌అప్‌లను చేర్చుకుంది. ఎంపికైన ఈ స్టార్టప్‌లు మారుతి సుజుకి ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ (ఎమ్మెస్ ఐపి) 5వ కోహార్ట్ విజేతలు. ఎమ్మెస్ ఐపి ప్రోగ్రామ్‌ను, ఐఐఎం బెంగళూరు వ్యవస్థాపకత మరియు స్టార్టప్ మద్దతు ఇంక్యుబేషన్ హబ్‌ అయిన ఎన్ఎస్ఆర్సిఇఎల్ (నాదత్తూర్ ఎస్. రాఘవన్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూరియల్ లెర్నింగ్) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, “మారుతి సుజుకిలో నిజమైన వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి వినూత్నమైన, ఆచరణాత్మకమైన పరిష్కారాలను రూపొందించేందుకు స్టార్ట్‌అప్‌లతో చురుకుగా కలిసి పనిచేస్తున్నామనీ అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *