విశాలాంధ్ర – రాప్తాడు : మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్‌ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో
వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటి
అద్భుత విజయాలను నమోదు చేశారు. ఎండి కృష్ణభరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా మాట్లాడుతూ ఈ ఫలితాల్లో ఏ. సాయిచరిత, ఎన్. లిపి 500 మార్కులకు 486 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. వై. హాసిని, ఎస్. ప్రణీత, ఎం. తమన్వి, ఏ. అన్విత తదితరులు ఉత్తమ మార్కులతో రాణించారన్నారు. విద్యార్థులు పట్టుదలతో కష్టపడి, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణలో చదివి మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రతిభ కనబరిచారన్నారు.
ఈ అద్భుత విజయానికి కారకులైన ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని, అలాగే పిల్లలను నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రుల సహకారం అభినందనీయమన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి మెమొంటోలను అందజేశారు.
ఈ ఘన విజయం సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి, పదవ తరగతి ఇంచార్జ్ జగదీష్ రెడ్డి, కళాశాల ఇంచార్జ్ మధు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


