భీమవరం బుల్స్ విజయం


భీమవరం ఓపెనర్స్ పవర్ ఫుల్ బ్యాటింగ్

బౌలింగ్లో అదరగొట్టిన పీవీఎస్ఎన్ రాజు సిహెచ్ రవితేజ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సిహెచ్ రవితేజ

మంగళగిరి (ఏసీ ఏ స్టేడియం) ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 లో భాగంగా మంగళగిరి వేదికగా మూడవరోజు రెండవ మ్యాచ్లో కాకినాడ కింగ్స్ మరియు భీమవరం బుల్స్ జట్లు తలపడ్డాయి మొదటిగా టాస్ గెలిచిన కాకినాడ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన కాకినాడ జట్టు ఒక్క బ్యాటర్ మినహాయించి మిగిలిన వారంతా పెవీలియన్కు వచ్చిన వారు వచ్చినట్టుగా చిన్న స్కోర్లకే క్యూ కట్టారు కాకినాడ బ్యాటర్లలో ఒంటరి పోరాటం చేసిన యువన్ 49 బంతుల్లో 61 పరుగులు 5 ఫోర్లు 3 సిక్సర్లు మినహాయించి ఏ ఒక్క బ్యాటర్ నుండి సహకారం లభించకపోవడంతో 19.4 ఓవర్లలో 118 పరుగులకే కాకినాడ జట్టు ఆలౌట్ అయింది బౌలర్లు సిహెచ్ రవితేజ 4 వికెట్లు పి వి ఎస్ ఎన్ రాజు మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భీమవరం జట్టు ఓపెనర్లు శుభహారంభాన్ని అందించడంతో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి మిగిలిన 9 వికెట్లు చేతిలో ఉండగానే లక్ష్యాన్ని భీమవరం జట్టు చేదించింది భీమవరం బ్యాటర్లలో హేమంత్ రెడ్డి 23 బంతుల్లో 42 పరుగులు4 ఫోర్లు 3 సెక్సర్లు మరొక ఓపెనర్ రేవంత్ రెడ్డి 34 బంతుల్లో 48 పరుగులు 5 ఫోర్లు 1 సిక్స్ తో దాదాపు లక్ష్యాన్ని పూర్తి చేశారు 1 డౌన్ బ్యాటర్ రవి కిరణ్ 14 బంతులో 25 పరుగులు 1 ఫోర్ 2 సిక్సర్స్ తో కేవలం 11.5 ఓవర్లలోనే 119 చేసి లక్ష్యాన్ని ఛేదించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సిహెచ్ రవితేజ ఎంపికయ్యాడు.

The post భీమవరం బుల్స్ విజయం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *