పీఓకేలో కూలినసైనిక హెలికాప్టర్


ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని ముజఫరాబాద్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. 21 మంది సిబ్బంది మరణించారు. హెలికాప్టర్ బయల్దేరే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. పాక్ ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్ కూలడంపై పాక్ సైన్యాధికారి అసీమ్ మునీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

The post పీఓకేలో కూలినసైనిక హెలికాప్టర్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *