పీఎం రాహత్ పథకం అమలుపరచాలి


విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇంచార్జ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పీఎం రాహత్( ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్) పథకం ద్వారా వైద్య చికిత్సలు అందించాలన్నారు. వైద్యం అందించిన ఆసుపత్రి కి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల చికిత్సకు అయిన ఖర్చును హాస్పిటల్ యాజమాన్యం పొందవచ్చని తెలిపారు. కావున తప్పనిసరిగా అన్ని ఆసుపత్రులు ఈ నెట్వర్క్ సదుపాయాన్ని కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రి యాజమాన్యం వారి యొక్క ఆసుపత్రి ముందు భాగంలో రోడ్డు వైపుగా సీసీ కెమెరాలు అమర్చాలని ఆ యొక్క సీసీ కెమెరా కనెక్షన్ ను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని తెలియజేశారు. తద్వారా రోడ్ యాక్సిడెంట్ బాధితులను, గుర్తించి సత్వర చికిత్స చేయటానికి ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి ఆసుపత్రి, క్లినిక్స్,ల్యాబ్స్ నిర్వాహకులు సకాలంలో రిజిస్ట్రేషన్,రినివల్స్ చేయించుకోవాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి , ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ గంగాధర్ రెడ్డి, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయకుమార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రెటరీ పణి మహేష్ రెడ్డి, మాస్ మీడియా అధికారి నాగరాజు, హెచ్ ఈ ఓ గంగాధర్, డిప్యూటీ హెచ్ఈఓ వెంకటేశ్వరరావు వేణుగోపాల్,కిరణ్, శ్రీకాంత్,లీగల్ అడ్వైజర్ ఆషారాణి,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

The post పీఎం రాహత్ పథకం అమలుపరచాలి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *