విశాలాంధ్ర ధర్మవరం:;పట్టణంలోని ఆదిత్య స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచుతూ విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ పి. జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించారు. ముఖ్యంగా స్కూల్ టాపర్స్ గా ఎస్. ముస్ఫీరా అంజుమ్ – 587 మార్కులు, కె. అక్షయ శ్రీ – 586 మార్కులు ఎస్. తేజ శ్రీ – 585 మార్కులు,ఎం. శ్రీ చౌడేశ్వరి – 581 మార్కులు, ఎం. అతియా – 566 మార్కులు,బి. సయ్యద్ మాధిహా సుల్తానా – 559 మార్కులు,ఈ. మోక్షిత – 557 మార్కులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు.ఈ విజయానికి కారణం విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల సహకారం అని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుత ఫలితాలను సాధించేందుకు ఆదిత్య స్కూల్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆశిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.


