“నేను రేపిస్టును కాను…ఆ చెత్తంతా చదవొద్దు”


జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ అనే దుండగుడు తుపాకులతో విరుచుకు పడటం… అత్యంత వేగంగా భద్రతా సిబ్బంది స్పందించి అతడిని పట్టుకున్న సంగతి విదితమే. అయితే నిందితుడు కాల్పులకు ముందు తన లక్ష్యానికి సంబంధిం చిన వివరాలను కుటుంబ సభ్యులకు పంపించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందులో అధ్యక్షుడు, ఉన్నతాధికారుల లక్ష్యంగా దాడి చేయబోతున్నట్లుగా సందేశం పంపించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మినహా అధికారులంతా లక్ష్యమని చెప్పాడు. అయితే అధ్యక్షుడు ట్రంప్‌పై నిందితుడు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. “ఒక పీడోఫైల్, అత్యాచారి, దేశద్రోహి. ఇకపై నా చేతులు కలుషితం కావడం సహిం చను” అంటూ ట్రంప్ గురించి నిందితుడు పరోక్షంగా రాసినట్లుగా శోధించారు. అయితే ఆదివారం సీబీఎస్ న్యూస్‌కు చెందిన జర్నలిస్ట్‌తో ట్రంప్ మాట్లాడుతుం డగా… మహిళా విలేకరి మధ్యలో కలుగజేసుకుని నిందితుడు మీ గురించి ఇలా రాశాడంటూ చదవ డం మొదలు పెట్టింది. అంతే ఒక్క సారిగా ట్రంప్ సహనం కోల్పో యారు. తానేమీ రేపిస్ట్‌ను కాదని.. అలాంటి పనులు ఎప్పుడూ చేయ లేదని.. ఇక చదవడం ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌కు సంబంధం ఉం దన్న విషయంలో ఈ సందర్భం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధం లేదని.. ఆ ఆరోపణల నుంచి పూర్తిగా విముక్తి పొందానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇక షూటర్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. “అతడు రాడికలైజ్ అయ్యాడు. ముందుగా అతడు క్రైస్తవ విశ్వాసి. తర్వాత యాంటీ క్రిస్టియన్‌గా మారాడు. ప్రస్తుతం మానసిక రోగి అయి ఉండొచ్చు” అని పేర్కొన్నారు. అమెరికాలో రాజకీయ హింస పెరగడానికి డెమో క్రటిక్ నాయకుల విద్వేష వ్యాఖ్యలే కారణమని… ఇది చాలా ప్రమాదక రమని వ్యాఖ్యానించారు. కాల్పుల సమయంలో తాను భయపడలేద న్నారు. కొద్దిసేపు అక్కడే ఉందామని భద్రతా సిబ్బందికి చెప్పినట్లు తెలిపారు. గత రెండేళ్లలో ఇది మూడో హత్యా యత్నం అని…మళ్లీ ఈ కార్యక్ర మంలో పాల్గొంటానని ట్రంప్ స్పష్టం చేశారు.

The post “నేను రేపిస్టును కాను…ఆ చెత్తంతా చదవొద్దు” appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *