నిస్వార్థము, ఐక్యత ఉన్నప్పుడే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయి.. కైపా ద్వారకనాథ శర్మ


విశాలాంధ్ర ధర్మవరం;; నిస్వార్థముతో ఐక్యత ఉన్నప్పుడే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయని కైపారక నాథ శర్మ, ముఖ్య అతిథులు దేశాయి పనిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో బ్రాహ్మణ కుటుంబీకులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్, డీఎస్సీలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను వారు పంపిణీ చేశారు. పదవ తరగతి విద్యార్థులలో కైప వజ్ర నగేశ్వర్ శర్మ, ఉదయ్ సాత్విక్, ఇంటర్మీడియట్ లో జ్ఞాన శ్రీత, డీఎస్సీలో అష్టకళ శ్రావణి, అదేవిధంగా డీఎస్సీలో మంచి ప్రతిభ ఘనపరిచి ఉపాధ్యాయులుగా ఎంపికైన చీపాటి శివతేజ లను ఘనంగా సన్మానించారు. తదుపరి ద్వారక నాథ్ శర్మతోపాటు ముఖ్య అతిథులు మాట్లాడుతూ బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. నిస్వార్థపుతో బ్రాహ్మణ కులస్తులు ముందుకు వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణులు తమ జీవన విధానమును అభివృద్ధి చేసుకొని అవకాశం ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు యువతి యువకులను స్థానం కల్పించినప్పుడే మంచి గుర్తింపు, మంచి ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. బ్రాహ్మణుల అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు అవసరమని, ఓకే తాటిమీద నిలబడాలని తెలిపారు. ఇకనుంచి బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించడమే మా లక్ష్యము అని తెలిపారు, బ్రాహ్మణ విద్యార్థులు సంకల్పము, లక్ష్యంతో ముందుకు వెళితే విజయం తప్పక లభిస్తుందని తెలిపారు. బ్రాహ్మణులకు చదివే మూలాధారమని, ఆ చదువును నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగితే సుఖవంతమైన జీవితం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి మంజునాథ్, గ్లామర్ సురేష్, ట్రాన్స్పోర్ట్ రవి, కరణము నరసింహమూర్తి, మునిపల్లి జైసింహ, సుధీర్ శర్మ, చంద్రమౌళి శర్మ, రాజశేఖర్ శర్మ, రాఘవ తో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *