మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిని సమగ్ర వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రినియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి కొరకు ఆధునిక మార్చురీ ఫ్రీజర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యము అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.3,71,700/- లక్షల వ్యయంతో ఆధునిక సాంకేతికత కలిగిన రెండు మృతదేహాల సామర్థ్యం గల స్టెబిలైజర్‌తో కూడిన మార్చురీ ఫ్రీజర్ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇది ఆసుపత్రి సేవల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో మార్చురీలో సదుపాయాల కొరత కారణంగా మృతదేహాలను భద్రపరచడంలో ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ తిప్పేంద్ర నాయక్, బీజేపీ నాయకులు బిల్లే శ్రీనివాసులు, ఏలుకుంట్ల లక్ష్మీనారాయణ, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


