విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ధర్మవరం కు చెందిన పళ్లెం జనార్ధన ను కలెక్టర్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడానికి ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులతో పాటు వినియోగదారుల సంఘాల నుంచి ముగ్గురు సభ్యులను కమిటీలో చేర్చడం జరిగిందన్నారు.
ఈ క్రమంలో పుట్టపర్తికి చెందిన జి. సురేష్ కుమార్, ధర్మవరం చెందిన పళ్లెం జనార్ధన్, మణిమాలలను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, తద్వారా వినియోగదారులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.వినియోగదారుల సంఘాల ప్రతినిధులను జిల్లా విజిలెన్స్ కమిటీలోకి ఎంపిక చేసినందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా సరఫరా శాఖ అధికారి లకు జిల్లా వినియోగదారుల సంఘం తరఫున పళ్లెం జనార్ధన కృతజ్ఞతలు తెలిపారు.


