రైల్వే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ కార్యాలయంలో ఫిట్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా కామన్ హెల్త్ క్రీడల ఇతివృత్తంలో చేయబడిన సండే సైకిల్ ప్రచార కార్యక్రమం యొక్క 75 వ విడతలో భాగంగా ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ ఎస్ఐపిఎఫ్ కోటీశ్వరరావు, ఏ ఎస్ ఐ పి ఎఫ్, ధర్మవరం ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి పట్టణ పరిధిలో సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శారీరిక దృఢత్వం, ఆరోగ్యమును పెంపొందించడం, అలాగే శారీరక కార్యకలాపాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే అన్న లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం సామాజిక శ్రేయస్సును కాపాడుకోవడం అనే సందేశాలను ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు.
The post ఘనంగా ఫిట్ ఇండియా ఉద్యమం.. appeared first on Visalaandhra.


