గ్రూప్ వన్ అధికారికి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ మేనేజర్ హోదాకు ఎంపిక


విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన కే సాయి గౌతమ్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ మేనేజర్ హోదాలో ఎంపికయ్యారు. వీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రూప్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి బీటెక్, ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ గా ప్రతిభ కనబరిచారు. వీరి తండ్రి కె. వినాయక ప్రసాద్ విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి జి. సుశీల గృహిణి. సోదరుడు డా. ప్రవీణ్ గౌతమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడికల్ సైన్స్ లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా సేవలందిస్తున్నారు.అలాగే సాయి గౌతమ్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూను 3 సార్లు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూను 3 సార్లు, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఇంటర్వ్యూను 3 సార్లు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా 100 మందికి పైగా సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లకు మార్గదర్శకత్వం అందించారు. అంతేకాకుండా పట్టణంలోని దేవీ నర్సింగ్ హోమ్ అధినేత కు మేనల్లుడు అవుతారు.మొత్తం మీద వీరు ఎంపిక పట్ల పలువురు విద్యావేత్తలు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *