విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పార్థసారధి నగర్ లో కాలింగ్ బెల్ కొట్టి మెడలోని మూడు తులాల బంగారం గొలుసులు గుర్తు తెలియని వ్యక్తి లాక్యలైన సంఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళితే దంపతులు లక్ష్మీదేవి బాల పెద్దన్న పార్థసారథి నగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త వీఆర్వో గా పెనుగొండలో విధులు నిర్వర్తిస్తుండగా, ఉదయం గుర్తుతెలియని వ్యక్తి ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో లక్ష్మీదేవి బయటకు రాగా అక్కడే పొంచి ఉన్న దుండగులు ఆమె మెడలోని బంగారాన్ని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ధర్మారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


