కట్టెల కోలాటం, చెక్క భజనతో కళకళలాడిన బొందలవాడ…


విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో కట్టెల కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో బీసీ కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వేడుకలు నిర్వహించారు.వెంకట్ వకుల ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు చేతుల మీదుగా కలశపూజ, గణపతి పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైన భజనలు తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగాయి.ప్రత్యేక అలంకరణలు, రంగురంగుల లైటింగ్, సౌండ్ సిస్టమ్ మధ్య ఏర్పాటు చేసిన వేదికపై యువత సమన్వయంతో కోలాటం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మధురమైన గేయాలు, వాయిద్యాలతో పాటు వినోదభరితమైన చెక్క భజన పద్యాలు ప్రేక్షకులను అలరించాయి.ఈ సందర్భంగా రామాయణం, మహాభారతం నుంచి భక్తి గీతాలతో పాటు సినీ గీతాలు కూడా వినిపించాయి. కార్యక్రమం మంగళవారం ఉదయం మహా మంగళహారతితో ముగిసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *