ఐపీఎల్-19లో…పంజాబ్‌ జైత్రయాత్రకు బ్రేక్


రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి

చండీగఢ్: ఐపీఎల్`19 సీజన్‌లో భారీ స్కోర్లు, పెద్ద లక్ష్య ఛేదనలతో అప్రతిహత విజాయాలతో దూసుకుపోయిన పంజాబ్ జట్టుకు ఓటమి ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లు అందుకోనంత భారీ స్కోర్లు చేయడం… రెండోసారి బ్యాటింగ్ చేస్తే ఎంతటి పెద్ద లక్ష్యాల్ని అయినా ఛేదించేయడం, ఇదీ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆట. మంగళవారం కూడా ఆ జట్టు పెద్ద స్కోరే చేసినప్పటికీ రాజస్థాన్ మంచి దూకుడు ప్రదర్శించి విజయాన్ని అందుకుంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలుస్తూ దూసుకెళ్తున్న శ్రేయస్ సేనకు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించిన రాయల్స్… పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. గత మ్యాచ్‌లో 265 పరుగుల లక్ష్యం ముందున్నా విజయాన్ని వదిలిపెట్టని పంజాబ్ కింగ్స్… రాజస్థాన్‌కు మంగళవారం తలవంచింది. బ్యాటింగ్‌లో సమష్టిగా సత్తా చాటిన రాయల్స్ 223 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (51; 27 బంతుల్లో 7ఐ4, 1ఐ6), వైభవ్ సూర్యవంశీ (43; 16 బంతుల్లో 3ఐ4, 5ఐ6) జట్టుకు బలమైన పునాది వేయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ’ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట;్ 26 బంతుల్లో 6ఐ4, 3ఐ6) విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. మొదట పంజాబ్ 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. స్టాయినిస్ (62 నాటౌట;్ 22 బంతుల్లో 4ఐ4, 6ఐ6), ప్రభ్‌సిమ్రన్ (59; 44 బంతుల్లో 6ఐ4, 1ఐ6) మెరిశారు. 8 మ్యాచ్‌లాడిన పంజాబ్‌కు ఇదే తొలి ఓటమి. ఆ జట్టు ఆరు విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. 9 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌కు ఇది ఆరో గెలుపు. వైభవ్ మొదలెడితే.. ఫెరీరా ముగించాడు. లక్ష్యం పెద్దదైనప్పటికీ.. ప్రణాళికబద్ధంగా ఆడిన రాయల్స్ అలవోకగా విజయాన్నందుకుంది. 6 ఓవర్లలో 72 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫెరీరా రాయల్స్ హీరోగా మారాడు. పంజాబ్ ప్రధాన బౌలర్లు అర్ష్‌దీప్, ఫెర్గూసన్, యాన్సెన్‌లను ధాటిగా ఎదుర్కొన్న అతను…భారీ షాట్లతో మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శుభమ్ దూబె సైతం సమయోచితంగా షాట్లు ఆడడంతో రాయల్స్ పని తేలికైపోయింది. చివరి ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాదిన ఫెరీరా మ్యాచ్‌ను ముగించడంతో పాటు అర్ధశతకం కూడా పూర్తి చేశాడు.

The post ఐపీఎల్-19లో…పంజాబ్‌ జైత్రయాత్రకు బ్రేక్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *