డిపో జేఏసీ కన్వీనర్లు నాగార్జున రెడ్డి, ముత్యాలప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిపో జేఏసీ కన్వీనర్లు నాగార్జున రెడ్డి, ముత్యాలప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం డిపో లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏపీపీ టీడీ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వం ముందించిన ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని, పినాకిల్ కంపెనీతో ఒప్పందాలు రద్దు చేయాలని, మూసివేసిన డిపోలను వెంటనే తెరిపించాలని, 11వ పి.ఆర్.సి.డి.ఏ అరియర్స్ను వెంటనే చెల్లించాలని వారి డిమాండ్ చేశారు. శ్రీ శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే నాలుగు వేలు కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని, సర్కులర్ నెంబర్ 1/2019 అన్ని డిపోలలో తప్పనిసరిగా అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు విలీనమునకు ముందు ఉన్న పాత పద్ధతిలో రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు కల్పించాలని, పెండింగు డీఏలు ఐ ఆర్ వెంటనే ప్రకటించాలని, 12వ పి.ఆర్.సి కమిషన్ వేయాలని, ఆర్టీసీలోని అన్ని కేటగిరీలలో ఖాళీగా ఉన్న పదివేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆదినారాయణ, బి. నర్సింలు, జే.ముస్తఫా, గోపాల్, ప్రభాకర్, మల్లికార్జున తో పాటు అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.


