భారీగా 7 కిలోల గంజాయి స్వాధీనం…14 మంది గంజాయి విక్రేతల ముఠా అరెస్ట్
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : భారీగా 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని 14 మంది గంజాయి విక్రేతల ముఠా అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వీరిలో ఒక కింగ్ పిన్ సహా ఐదుగురు పాత నేరస్తులు ఉన్నారు… మిగితా 9 మంది గంజాయిని పాకెట్ల రూపంలో స్థానికంగా విక్రయిస్తున్నవారు. తీగలాగితే డొంక కదిలిన వైనంగా గంజాయి టెస్టింగ్ కిట్లు ద్వారా అనంతపురంలో భారీగా టెస్టులు నిర్వహించడంతో పలువురికి పాజిటివ్ రావడంతో వారిపై ప్రత్యేక పోలీసు నిఘా విచారణ చేపట్టడం జరిగిందన్నారు. నిందితుల వివరాలను తెలియజేశారు. ఈ అరెస్టులో పాల్గొన్న పోలీస్ బృందంఅనంతపురం అర్బన్ ఎస్ డి పి ఒ వి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో, గంజాయి రవాణాపై పక్కా సమాచారంతో నిఘా ఉంచిన ప్రత్యేక బృందాలు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.జి. వెంకటేశ్వర్లు (ఇన్స్పెక్టర్, వన్ టౌన్ పి ఎస్ )రాగిరి రామయ్య, జయపాల్ రెడ్డి, శేషగిరి (ఇన్స్పెక్టర్లుసి సి ఎస్ అనంతపురం),ఎస్. కరిష్మా (పి ఎస్ ఐ టూ టౌన్పిపి ఎస్ ) ,ఎ. శరత్ చంద్ర (ఎస్ ఐ , త్రీ టౌన్ పీఎస్ ) మరియు పోలీస్ సిబ్బంది. ఈగల్ విభాగం ఆర్ ఎస్ ఐ హనుమంతు, యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయదారులపై కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
The post అనంతలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం… appeared first on Visalaandhra.


