సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక – Visalaandhra
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, డా.మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో అధికారంలోకి వచ్చీ రావడంతోటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్టయింది. ఇది శ్రామిక వర్గానికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. 100 నుంచి 150ఏళ్ల కాలం సుదీర్ఘ పోరాటం చేసి శ్రామికవర్గం సాధించుకున్న హక్కులకు క్రమంగా కోత పడడం మొదలైంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రమజీవుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం…


