గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది….


