గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు….

Read More

ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం – Visalaandhra

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక తిక్కయ్య స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ముత్యాల తలంబ్రాలతో పాటు పూజా సామగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు….

Read More

పట్టపగలే ఎర్ర మట్టి దందా… – Visalaandhra

‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?”…

Read More

ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి…

Read More

దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్…..

Read More

ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు…

Read More

మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో…

Read More

అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్…

Read More

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం (మార్చి 27) పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. విపత్తుల…

Read More

మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…

Read More