సోషల్ మీడియా పరిచయాలు యువతులను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్
స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచితులతో ఏర్పడుతున్నపరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఃఎక్స్ః వేదికగా హెచ్చరించారు. ఁఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను…


