నీటి ఆదాకు నెటాఫిమ్‌తో కలిసి పనిచేస్తున్న అమెజాన్
బెంగళూరుః సుస్థిరమైన నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి ఆర్బియా ప్రెసిషన్ అగ్రికల్చర్‌లో భాగమైన నెటాఫిమ్‌తో కలిసి అమెజాన్ ఇండియా నేడు బెంగళూరు, హైదరాబాద్‌లలో కొత్త నీటి పొదుపు ప్రాజెక్టులను ప్రకటించింది. సంప్రదాయ వరద నీటిపారుదలని బిందు సేద్యంతో భర్తీ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 325 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తాయని భావిస్తున్నారు. బిందు సేద్యం నీటిని నేరుగా మొక్కల వేళ్ళకు అందిస్తుంది, పంట దిగుబడిని కొనసాగిస్తూ వథాను గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశంలోని నీటి…


