సింధు జాలలు ఆపడం యుద్ధ చర్యవంటిదే


మా వాటా కోసం అన్ని చర్యలు తీసుకుంటాం: పాక్ ఆర్మీ
కరాచీ:
పాక్ ఆర్మీ కవ్వింపులు మరొక్కసారి బహిర్గతమయ్యాయి. సింధు జలాలు ఆపడంపై ఆ దేశ సైనికాధిపతి ఆసిమ్ మునీర్ తన అక్కసును వెళ్లగక్కారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధు జాలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)ను భారత్ నిలిపివేసిన సంగతి విధితమే. ఐడబ్ల్యూటీని భారత్ పక్కనబెట్టడంతో పాకిస్థాన్ ఇప్పుడు ఉక్కిర్ఙిక్కిరవుతోంది. ఈ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ జలాల వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని 276వ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆసిమ్ మునీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సింధూ జలాల కోసం పోరాడుతామని సైన్యం తెలిపింది. 2025 ఏప్రిల్ 24 నాటి జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ) ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సింధూ జలాలను ఆపే ఎటువంటి ప్రక్రియనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని తెలిపింది. నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమని…సింధూ జలాల ఒప్పందం చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దాన్నెవరూ రద్దు చేయలేరని భారత్‌పై అక్కసు వెల్లగక్కింది. తాలిబన్ల నియంత్రణలో ఉన్న అఫ్గాన్లోని భూభాగాలను ఉపయోగించుకుని ఉగ్రవాదులు పాక్‌లోని పలు ప్రదేశాలపై దాడులు చేస్తుండడం పట్ల సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి సాయుధ దళాలు నిరంతరం కృషి చేస్తున్నాయని పేర్కొంది. కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు ఎప్పటికీ ఉంటుందని పునరుద్ఘాటించింది. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ల మధ్య 1960లో ఈ ఒప్పందం జరిగింది. 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్థాన్‌కు పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పాక్ మంత్రులు, అధికారులు దీనిపై స్పందిస్తూ…భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *