పాలకుల ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటాలకు విద్యార్థులు సిద్దం కావాలి ….సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య


విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : భారత దేశ స్వాతంత్రోధ్యమం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎసఎఫ్ అని నాడు రవిఅస్తమించని బ్రిటీష్ సాంమ్రాజ్యంతో పోరాటాలు చేసిన విద్యార్థిసంఘం అని అటువంటి సంఘంలో పనిచేయడం గొప్పవిషయంగా భావించాలని ఏఐఎసఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. బుధవారం పందిపాడు గ్రామంలోని టీజీఆర్ ఫంక్షన్ హాలు జులై 1 నుండి 4 వరకు జరుగు ఏఐఎసఎఫ్ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏఐఎసఎఫ్ పతాకాన్ని ఏఐఎసఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి , సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు ప్రాంభించారు. అనంతరం శిక్షణా తరగతులను ప్రారంబిస్తూ ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటాలకు విద్యార్థులు సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ శిక్షణా తరగతులకు ప్రొఫెసర్‌లు, మేధావులు వచ్చి విద్యార్థులకు జీవితపాటాలు నేర్పుతాయన్నారు. కష్టాలను ఎలా ఎదుర్కొవాలో తెలియచేస్తారన్నారు.విద్యార్థులకు సామాజిక ,రాజకీయ విలువలను అందించే సంఘం ఏఐఎసఎఫ్ అన్నారు. నేడు రాజకీయాలు కలుషితం అయ్యాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2025 నవంబరు 26వ తేదిన జరిపిన మాక్ అసెంబ్లీ సందర్భంగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇవ్వడంను మేము స్వాగతిస్తున్నామన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళాశాల్లో విద్యార్థులకు ఎన్నికలకు లేకుండా రద్దుచేయడం వలన రాజకీయాల్లోకి విద్యార్థులు వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. నాడు ఎంతో మంది మేధావులు యÖనివర్శిటీల నుండి రాజకీయాల్లోకి వచ్చి మంచి పరిపాలన దక్షులుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళాశాలల్లో ఎన్నికలు రద్దుచేశాడని విమర్శించారు.రాజకీయాల్లోకి ప్రస్తుతం వారసులు వస్తున్నారని అటువంటి వారి వలన విలువలతో కూడిన రాజకీయం ఆశించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైన విద్యార్థులు యువజనులు మౌనం వీడి ప్రశ్నించే తత్వం అలవరచుకుని రాజకీయ వారసులుగా నేటి సమాజంలో రాణించకలిగేందుకు విద్యార్థి సంఘాలు ఎంతగానో దోహదపడతాయని , విద్యార్థుల సంక్షేమం కోసం అందిస్తున్న శిక్షణా తరగతులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపు నిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *