ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..


యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ( వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) జులై ఏడవ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని స్వాతి క్లినిక్ నందు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా వృద్ధి హోం ఫైనాన్స్ మెయిన్ బజార్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరం యువర్ ఫౌండేషన్, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్ తో సెల్ నెంబర్, చిరునామాతో రావాల్సి ఉందని తెలిపారు. బిపి, షుగరు, గుండె జబ్బు ఉన్నవారు వాడుచున్న మందుల వివరాలను తీసుకొని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత సుంకు సుకుమార్, గర్రె రమేష్ బాబు, రాధాకృష్ణ, డాక్టర్ బి వి సుబ్బారావు, చాంద్ బాషా, కోటేశ్వరరావు, బండ్లపల్లి రంగనాథ్, సత్రశాల మల్లికార్జున, కేతా లోకేష్, లక్ష్మీనారాయణ, నామాల శ్రీనివాసులు, ఓ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *