ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి..


క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవాలయ ఆవరణమునందు జూన్ 28వ తేదీ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 124వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలతోపాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. నేటి ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి ఓబులమ్మ, కీర్తిశేషులు దాసరి నారప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు దాసరి మంజునాథ్, దాసరి ప్రమీల వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరానికి వైద్యులుగా డాక్టర్ వివేక్ కుల్లాయప్ప, డాక్టర్ సతీష్ కుమార్ డాక్టర్ జైదీపునేత డాక్టర్ విట్టల్ డాక్టర్ ప్రణయ్ హాజరై రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వివరిస్తారని తెలిపారు. వైద్య చికిత్సల అనంతరం ఒక నెలకు సరిపడు. మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఈ శిబిరాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *