బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా?


అసెంబ్లీ సమావేశాలపై రామకృష్ణ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ‘తిరుపతి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి రాష్ట్ర శాసనసభలో, శాసనమండలిలో, మంత్రివర్గంలో, చివరకు దిల్లీలో ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. లడ్డూ సమస్య తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేనట్టు అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలకు, దూషణలకు దిగటం విచారకరం. లడ్డూ వివాదానికి ఇకనైనా ముగింపు పలికేందుకు అధికార, ప్రతిపక్షాలు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్ప్పుకుంటున్న వారు ఏం చేశారో సమాధానం చెప్పాలి. తిరుపతి లడ్డ్డూ విషయంలో కల్తీ జరిగిందని అందరూ అంగీకరిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెబుతున్నారు. అటువంటప్ప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేక పోయింది’ అని రామకష్ణ ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ, సీఐడీ, సీబీఐ డబుల్ ఇంజిన్ సర్కార్ చేతుల్లోనే ఉన్నప్పటికీ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేక మాటల ప్రభుత్వంగానే మిగిలిపోతున్నదని ఆయన విమర్శించారు. కూటమి పాలకులు లడ్డూ అంశాన్ని రోడ్డెక్కి మాట్లాడడం, మీడియాలలో మాట్లాడడం మాత్రమే చేస్తున్నారు. కల్తీపై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం రాష్ట్రంలో ఇంకా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉందా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. పాలనాదక్షుడిగా, రాజకీయ అనుభవజ్ఞుడిగా చెప్ప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ఆ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. లడ్డూ కల్తీకి ఎవరైతే కారకులో… వారిపై చర్యలు తీసుకోకుండా మాటలకే పరిమితమవ్వటం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే లడ్డూ వివాదానికి స్వస్తి పలకాలి. లడ్డూ కల్తీకి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సుహృద్భావ వాతావరణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరపాలని రామకృష్ణ కోరారు.

The post బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *