కుల రాజకీయాలను ప్రోత్సహించడం దురదృష్టకరం.. – Visalaandhra


జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; కుల రాజకీయాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , ఆ పార్టీ నాయకులు కుల రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదు అన్నారు.జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కులాలను కలిపే నాయకుడని, ఆయనను ఒకే కులానికి పరిమితం చేయాలని చేసే ప్రయత్నాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల నాయకుడని స్పష్టం చేశారు. గతంలో కుల రాజకీయాలకు పాల్పడిన కారణంగానే వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైందని, అయినప్పటికీ ఆ పార్టీ నాయకత్వానికి ఇప్పటికీ బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సవాల్ విసిరారు.అలాగే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి జగన్ మోహన్ రెడ్డినే కారణమని మీరే వ్యాఖ్యానించారని, ఇప్పుడు అదే జగన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. జనసేన పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక సమైక్యత మరియు అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతుందని తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *