నీవు చేసిన మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధం


సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నీవు చేసే మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధంగా ఉన్నామని, నీవు విచారణకు సిద్ధంగా ఉన్నావా అని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విసిరారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీపైగానీ, నాయకులపై గానీ అసత్య అరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మండలంలో సిపిఐ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తామన్నారు . నాగలాపురంలో నీవు ఎంతో మంది పేదల కడుపు కొడుతున్నావని మీ గ్రామంలోని ప్రజలతో చెప్పిస్తే అడ్వకేట్ సర్టిఫికెట్ ను వదలుకుంటావా అని సవాల్ విసిరారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ విచారణకు రావాలని, నీవు చేసే అరాచక పనులు నిరూపిస్తామన్నారు. మా మండల కార్యదర్శి పై కేసులు ఉంటే పేద ప్రజల కోసం కొట్లాడి జైలుకు వెళ్లారు కానీ నీలాగా తప్పుడు పని చేసి జైలుకు వెళ్లలేదన్నారు. గతంలో పురుషోత్తంరెడ్డి విషయంలో నీపై కేసులు ఉన్నప్పుడు సిపిఐ పార్టీని ఆశ్రయించి తప్పించుకున్నావన్నారు. గతంలో కూడా పేదలు గడ్డివాములు వేసుకుంటే వాటిపై కూడా చేసిన అరాచకాలు మాకు తెలియదు అనుకున్నావా అన్నారు. నీవు బహిరంగ విచారణకు ఎప్పుడు వస్తావో చెప్పాలని, సిపిఐ పార్టీ సిద్ధంగా ఉంటుందని, అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో బాబు, రెక్కల గిడ్డయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *